మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన నిర్ణయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ రాష్ట్రసమితి పార్టీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భవిష్యత్తులో రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా..?. సరిగ్గా మూడేండ్ల తర్వాత జరగబోయే ప్రత్యేక్ష సార్వత్రిక లోక్ సభ ఎన్నికలకు ఆయన దూరంగా ఉండనున్నారా ..?. అంటే తాజాగా మీడియాతో ఆయన మాట్లాడిన మాటలను బట్టి అవుననే సమాధానం వస్తుంది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రాజకీయంగా టీడీపీ వైపా, బీజేపీ వైపా, బీఆర్ఎస్ వైపా అని కాదు. నేను ప్రస్తుతం నేను బీఆర్ఎస్ లో ఉన్నాను. నేను ఎంపీ అయ్యాను. మంత్రిని అయ్యాను. ఎమ్మెల్యేగా గెలిచాను. మరో మూడేండ్లు నేను ఎమ్మెల్యేగా ఉంటాను. తనకు ప్రస్తుతం డెబ్బై మూడేండ్లు. ఇంకో మూడేళ్లు రాజకీయాల్లో కొనసాగుతానని” చెప్పారు.
మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశానని, ఇక రాజకీయాలే వద్దనుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేస్తూ విద్యార్థులను ఇంజినీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దుతాను. విద్యాసంస్థల బాధ్యతలను మున్ముందు నేను చూస్కుంటాను. దేశ వ్యాప్తంగా కాలేజీలు, యూనివర్సిటీలు స్థాపిస్తాను అని మల్లారెడ్డి పేర్కొన్నారు.