కేంద్ర మంత్రి ధర్మేంద్రతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ..!
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఢిల్లీలో యూజీసీ నిబంధనలు మార్చడంపై కలిశామని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఈ మార్పుపై అభ్యంతరం తెలియజేస్తూ ఆయనకు లేఖ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఎన్ఎస్ఎస్సీ క్లాజ్ తో రిజర్వ్డ్ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశముందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని ఆయన తేల్చి చెప్పారు. ఉపఎన్నికలు జరగాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.