మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్..!

Former Minister Kodali Nani discharged..!
గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్ కానున్నారు..
గత వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆస్పత్రిలో మాజీ మంత్రి కొడాలి నాని చేరారు.. అతనికి వైద్యులు వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారణ చేశారు..
సాధ్యమైనంత త్వరగా స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.. సర్జరీ విషయంలో కొంత సమయం తీసుకోవాలనే యోచనలో కొడాలి నాని కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది..