మాజీ మంత్రి హారీష్ రావు సంచలన నిర్ణయం.!-త్వరలోనే…?

 మాజీ మంత్రి హారీష్ రావు సంచలన నిర్ణయం.!-త్వరలోనే…?

Loading

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి,బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ది లక్కీ హ్యాండ్ గా పోరుంది.పార్టీ ట్రబుల్స్ లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇస్తూ పార్టీకి విజయాలనందిస్తాడని,బీఆర్ఎస్ క్యాడర్ అతన్ని ట్రబుల్ షూటర్ అని పిలుస్తుంటారు,అయితే హరీశ్ రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే డిమాండ్‌తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు.

రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణఖేడ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాగా, ఇటీవల ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సలో తనను కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్‌ మాట్లాడుతూ.. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం పోరాడదామని శ్రేణులకు సూచించారు. ఈ బాధ్యతను సీనియర్‌ నేత హరీశ్‌రావుకు అప్పగించారు. అందుకు అనుగుణంగానే హరీశ్‌రావు పాదయాత్రకు సిద్ధమయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ మేరకు పాదయాత్ర తేదీలను ప్రకటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో వెలువడితే.. ఎన్నికల తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తారు. ఎన్నికలు ఏప్రిల్‌, మేలో ఉంటే.. ఈ నెలలోనే పాదయాత్ర మొదలుపెడతారు. ప్రతి రోజూ సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. ఆరు రోజులపాటు సుమారు 130 కిలోమీటర్ల యాత్ర కొనసాగించేలా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, అందోల్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగుతుంది. సర్వే పూర్తయి భూసేకరణ దశలో నిలిచిపోయిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించి జిల్లాలోని 397 గ్రామాల్లో దాదాపు 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని హరీశ్‌రావు కోరుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *