జగన్ కు మాజీ మంత్రి కౌంటర్..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనను జగనన్న 2.0గా కొత్తగా చూస్తారు అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. జగనన్న 2.0 అంటూ జగన్ కొత్త నాటకం మొదలెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ పై మండిపడ్డారు.
‘జగన్ అంటున్నట్లు అది 2.0 కాదు.. పాయింట్ 5. ఆయన కాళ్ల కింద వ్యవస్థలు నలిగిపోయాయి. ఐదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం వింతగా ఉంది.
జగన్ ఎన్నో ప్యాలెస్లు కట్టించుకున్నారు. టీడీపీ సంగతి తర్వాత చూద్దువు.. ముందు మీ పార్టీ సంగతి చూడండి’ అని సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి జగన్ కు హితవు పలికారు.
