మాజీ సీఎం KCR కు వైద్య పరీక్షలు పూర్తి..!

Former CM KCR
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఈరోజు గురువారం ఉదయం పదకొండున్నరకు చేరిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు.
దీంతో కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి నందినగర్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇదే నెల మూడో తారీఖున ఆయన తీవ్ర అస్వస్థతతో ఇదే ఆసుపత్రిలో ఆయన చేరిన సంగతి తెలిసిందే. ఆరోజు చేసిన వైద్య పరీక్షల్లో కేసీఆర్ కు ఆరోగ్యం మెరుగ్గానే ఉంది,సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయి అని వైద్యులు నిర్ధారించారు.
దాదాపు రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను డిశ్చార్జ్ చేసే సమయంలోనే మళ్లీ ఆసుపత్రికి రావాలని ఈనెల ఐదో తారీఖున డిశ్చార్జ్ చేశారు. వైద్యుల సూచనమేరకు కేసీఆర్ మళ్లీ గురువారం ఆస్పత్రికి వచ్చారు.