హైకోర్టుకు మాజీ సీఎం కేసీఆర్..!

Former CM KCR to the High Court..!
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
ఉద్యమ సమయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు మంగళవారం హైకోర్టు విచారించింది. తెలంగాణ సాధనలో భాగంగా జరిగిన మలిదశ ఉద్యమంలో 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్‌లో కేసీఆర్ రైల్ రోకో చేపట్టారు.
అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగులో ఉంది.విచారణలో అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపు మేరకే రైల్ రోకో చేపట్టారని పీపీ కోర్టుకు తెలిపారు.అయితే రైల్ రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న న్యాయస్థానం రైల్ రోకో ఘటన గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసు ఇవ్వాలని ఆదేశించింది.
