లండన్ కు మాజీ సీఎం జగన్..!

YS Jagan in Pulivendula..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి నిన్న మంగళవారం లండన్ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి King’s College Londonలో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సులో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు.
ఆమె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరుకానున్నారు. 16న డిగ్రీ ప్రదానోత్సవం జరగనుంది. అనంతరం నెలాఖరున జగన్ లండన్ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
