భూకబ్జా కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..!

 భూకబ్జా కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..!

BRS’ sensational decision on the HCU land dispute..!

Loading

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరులో సామ దామోదర్ రెడ్డికి సంబంధించిన 170 ఎకరాల భూమి విషయంలో అర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై 2024 మే 27న కేసు నమోదైంది. వాణిజ్య అవసరాలకు సంబంధించిన ప్లాట్లు చూపించి ఎంవోయూ కుదుర్చుకుని డబ్బులు ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య రజిత, తల్లి రాజుబాయిలపై దామోదర్ రెడ్డి కేసు పెట్టారు.

ఈ కేసులో తల్లికి, భార్యకు బెయిలు మంజూరు కాగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రాలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంతో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది. ఈ మేరకు భూ కబ్జా ఆరోపణలకు సంబంధించిన కేసులో భారాస నాయకుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుక్రవారం మోకిల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు ఠాణాకు వచ్చిన ఆయనను.. ఏసీపీ రమణగౌడ్, సీఐ వీరబాబు మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. ఠాణాకు వచ్చిన ఆయన.. కేసు విషయానికి సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారని సీఐ వీరబాబు తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *