హరీష్ శంకర్ అసహనం
ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్లో భాగంగా తీవ్ర అసహనానికి గురయ్యారు.. ఈ సందర్భంగా తన సినిమాకు మీకు నచ్చినట్లు ఎన్ని రకాల రివ్యూలు అయిన మీకు తోచినట్లుగా ఏమైనా రాసుకోవచ్చు…
నచ్చిన రేటింగ్లు ఇచ్చుకోవచ్చని దర్శకుడు హరీశ్ శంకర్ సవాల్ విసిరారు. తన ఆత్మాభిమానం దెబ్బతీసిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులతో ముఖాముఖిగా గొంతెత్తినట్లు హరీష్ శంకర్ తెలిపారు.
‘ఇట్స్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ నాట్ ఆటిట్యూడ్’ అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగ్ వేశారు. కాగా మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్లు ఆగస్టు 14 నుంచే మొదలవుతాయని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు.