గాంధీ భవన్ మెట్లపై రైతన్న..?

Farmer on the steps of Gandhi Bhavan..?
కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రుణమాపీ,రైతు భరోసా విషయంలో నిత్యం రైతులు రోడ్డెక్కుతున్నారు..నిత్యం నిరసనలు తెలుపుతున్నారు అయితే ఈ రోజు నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలి గౌరారం మండలం, చిత్తలూరి గ్రామానికి చెందిన రైతు తోట యాదగిరి రుణమాఫీ ఇప్పటివరకు కాలేదు.
రైతు భరోసా రాలేదు ,పింఛను రాలేదు రేవంత్ రెడ్డి పట్టించుకోవలని రైతు యాదగిరి ఆవేదనతో హైదరాబాదులోని గాందిభవన్ కు వచ్చి తన నిరసన తెలిపారు..
రుణమాఫీ చేస్తారా లేదంటే పురుగుల మందు తాగి గాంధీ భవన్ మెట్లమీదనే కూర్చుంటా అంటూ రైతు యాదగిరి డిమాండ్..గ్రామాల్లోనే ఉన్న నిరసనలు నేడు కాంగ్రేస్ పార్టీ ఆఫీస్ కు చేరటం,రైతే స్వయంగా వచ్చి ఆత్మహత్య చేసుకుంటా అని హెచ్చరించడం సంచలనంగా మారింది.
