వారికి రైతు భరోసా నిధులు జమ?
![వారికి రైతు భరోసా నిధులు జమ?](https://www.singidi.com/wp-content/uploads/2025/01/469381408_1144041510413566_4325187261128531419_n-850x560.webp)
తెలంగాణ వ్యాప్తంగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతుభరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఎకరం ఉన్న దాదాపు 17.03లక్షల రైతుల అకౌంట్లలో నిధులు జమ చేశాము.
రైతులకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉంది..
ఇప్పటికే రైతుబంధుకు రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు చెల్లించాము. రైతు భీమాకు రూ.3000 కోట్లు ఇచ్చామని మంత్రి తుమ్మల అన్నారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)