ప్రముఖ నిర్మాత మృతి

Breaking News
16 total views , 2 views today
ప్రముఖ తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు (50) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డిల్లీ బాబు చికిత్స పొందుతూ ఈ రోజు సోమవారం ఉదయం మృతి చెందారు.
రాక్షసన్, ఓ మై గాడ్ ,బ్యాచిలర్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఆయన నిర్మాతగా వ్యహరించిన మిరల్, మరకతమణి తెలుగు భాషాలోనూ విడుదలై ఘన విజయం సాధించాయి.
ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా చిత్రీకరణలో ఎక్కడ కూడా రాజీపడని తత్వం అని తమిళ ఇండస్ట్రీలో టాక్.
