పార్టీ మార్పు పై మాజీ మంత్రి ఎర్రబెల్లి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చీఫ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ మాజీ నేత కావడం.. అందులో తనకు దోస్తానం ఉండటం ..
గతం గతః అన్నట్లు రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు.. శాశ్వత శత్రువులుండరన్నట్లు ఓటుకు నోటు కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర కోపంగా ఉన్న కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అవన్నీ పట్టించుకోకపోవడంతో రేవంత్ తనని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ వార్తల సారాంశం.
అయితే పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అదంతా ఫేక్ ప్రచారం. తప్పుడు వార్తలను ప్రచారం చేసేవాళ్లను శిక్షించాలి. తన కంఠంలో ప్రాణమున్నంతవరకు కేసీఆర్ గార్ని.. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు.