రేవంత్ రెడ్డికి షాకిచ్చిన దుబాయి పోలీసులు..!

సీఎం రేవంత్ రెడ్డికి దుబాయి పోలీసులు షాకిచ్చారు. ఇటీవల దుబాయిలో మృతి చెందిన ప్రముఖ నిర్మాత కేదార్ మృతిపై అనుమానాలున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.
తాజాగా నిర్మాత కేదార్ మృతిపై విచారణ జరిపి ఎలాంటి కుట్ర లేదని దుబాయ్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రపంచంలో ఎవరు ఎక్కడ చనిపోయిన సరే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్న సంగతి తెల్సిందే.
కొద్ది నెలల క్రితం గుండెపోటుతో చనిపోయిన న్యాయవాది సంజీవ రెడ్డి, భూపాలపల్లి భూ వివాదంలో జరిగిన రాజలింగమూర్తి హత్య విషయంలో, నిర్మాత కేదార్ మృతి విషయంలో మిస్టరీగా ఉన్నాయంటూ మీడియాతో చిట్ చాట్ చేస్తూ రేవంత్ రెడ్డి చెప్పేశారు.
సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయాల్సింది పోయి గాలి గన్నయ్య లాగా నోటికొచ్చిన ఆరోపణలు చేసే రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాగా దుబాయ్ పోలీసులు తాజాగా క్లీన్ చిట్ ఇచ్చారు.
