రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతతో తాగునీటి కష్టాలు..!

 రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతతో తాగునీటి కష్టాలు..!

Dr Dasoj Sravan Give Suggestions To Revanth Reddy On Hydra

Loading

హైదరాబాద్ లో తాగునీటి సమస్య తీవ్రంగా ముదిరిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని బీఆర్ఎస్ సీనియర్ నేత డా. శ్రవణ్ దాసోజు తీవ్రంగా విమర్శించారు. ఇబ్రహీం నగర్, బంజారాహిల్స్, రోడ్ నెం.10, ఖైరతాబాద్ అసెంబ్లీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

“హైదరాబాద్ @revanth_anumula అసమర్థ పాలన కింద కష్టాలను ఎదుర్కొంటోంది. సీఎం petty politics తో బిజీగా ఉంటే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే @NagenderDanam మాత్రం పార్టీ ఫిరాయింపు కేసుల పరిరక్షణలో మునిగిపోయారు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నది సామాన్య ప్రజలే!” అని డా. శ్రవణ్ దాసోజు మండిపడ్డారు.

అదే సమయంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి నీటి సమస్యలు ఎప్పుడూ ఎదురుకాలేదు అని స్పష్టంగా గుర్తుచేశారు. “మిషన్ భగీరథ నీరు ఎక్కడ? ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని చేసిన హామీలు ఏమయ్యాయి?” అని ప్రశ్నించారు.

కెసిఆర్ పాలనలో పది ఏళ్ళ తెలంగాణ లో తాగునీటి కోసం ఈ సమస్యలు లేవే? ఇప్పుడు ఇప్పుడు నీటి కొరతసమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ వైఫల్యం జరిగింది? రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎందుకు బాధపడాలి? తెలంగాణ ఏర్పాటుకు ముందు మహిళలు తాగునీటి కోసం రోడ్లపై నిరసనలు చేసిన రోజులను మళ్లీ తీసుకువస్తున్నారా?” అంటూ కడిగేసారు.

@HMWSSBOnline @GHMCOnline వంటి సంబంధిత అధికారులను ట్యాగ్ చేస్తూ, “ఈ ప్రభుత్వానికి తాగునీటి సరఫరా అందించడమే అంతకష్టం అనిపిస్తోందా? @TelanganaCMO PR స్టంట్స్, రాజకీయ నాటకాల కంటే సుపరిపాలనపై దృష్టిపెట్టాలి! హైదరాబాద్ ప్రజలకు సమాధానాలు కావాలి, భరోసా కావాలి, కుంటిసాకులు కాదు!” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణ చర్యలు తీసుకోండి!

హైదరాబాద్ ప్రజలు మరింతగా ఇబ్బందులు పడకుండా తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని, ప్రభుత్వం బాధ్యత వహించాలని డా. శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు. “పోలిటికల్ డ్రామాల కోసం ప్రజలను నరకయాతన అనుభవించేందుకు నెట్టివేయకండి. తక్షణమే నీటి సమస్య పరిష్కరించండి!” అంటూ ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *