రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే..?
ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్లు తాగడం కంటే రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగి పడుకుంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ నయమవుతాయి.
రాత్రిపూట తీసుకున్న ఆహారం జీర్ణమై ఉదయం సుఖవంతంగా విరోచనాలు అవుతాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపు తేలికగా ఉందన్న భావన కలుగుతుంది. గోరు వెచ్చని నీళ్లు శరీరంలో నాడి వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది.
నిద్రలేమి సమస్య ఉన్నవారు గోరువెచ్చని తాగు నీళ్ళు తాగిపడుకుంటే ఆ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు.వేడి నీళ్లు తాగడం వల్ల ట్యాక్సిన్స్ తొలగిపోతాయి. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.