దేశానికి కావాల్సింది “జమిలీ ఎన్నికలు కాదు… !మరి….?

 దేశానికి కావాల్సింది “జమిలీ ఎన్నికలు కాదు… !మరి….?

One Nation One Election

ప్రస్తుతం ఇటు రాష్ట్రాల్లో అటు దేశ రాజకీయ వర్గాల్లో ప్రధాన హాట్ టాఫిక్ ” జమిలీ ఎన్నికలు”. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించింది. అయితే దీన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితేనే అది చట్టంగా మారుతుంది.ఈ బిల్లు చట్టంగా రూపొందించడానికి రాజ్యాంగంలో ఆరు సవరణలను చేయాలి. ఆతర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 సభ్యుల ఆమోదం పోందాలి. ఒకవేళ జమిలీ బిల్లు చట్టంగా మారితే దేశంలోని పార్లమెంట్ ,సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు వందరోజుల్లోనే నిర్వహించాలి.దేశంలో ఒకేసారి పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికలు జరగడం కొత్త ఏమి కాదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1967వరకు ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నుండి ఇలా వేర్వేరుగా జరుగుతున్నాయి.

మరి మనదేశానికి కావాల్సింది ఏమిటి జమిలీ ఎన్నికలా..?. ఇంకా ఏమి కావాలి..?.జమిలీ ఎన్నికల వల్ల కలిగే లాభాలు ఏంటని ఆలోచిస్తే సమయం మిగులుతుంది.. ఆయా రాజకీయ పార్టీలతో పాటు ఈసీ వెచ్చించే ఖర్చు మిగులుతుంది.. ఎన్నికలవ్వగానే పాలనపై దృష్టిపెట్టవచ్చు అని చెప్పే కారణాలు.. టెక్నాలజీ అరచేతిలోకి వచ్చిన ఈరోజుల్లో ఎన్నికలు ఒకేసారి జరిగిన విడతల వారీగా జరిగిన అధికారంలోకి వచ్చిన పార్టీ నమ్మి ఓట్లేసిన ప్రజలకు సేవ చేయాలి.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అప్పుడే ఆ ఎన్నికలకు ఆర్ధం …పరామర్ధం.. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేండ్లైన కానీ ఇంకా రోడ్లు లేని రూరల్ ప్రాంతాలు. కరెంటు లేని ఇండ్లు… గ్యాస్ సిలిండర్ లేని వంటిళ్ళు మనకు దర్శనమిస్తాయి.. తాగడానికి కూడా గుక్కెడు నీళ్ళు లేక కొనుక్కోవాల్సిన పరిస్థితులు కూడా మనం అప్పుడప్పుడు మీడియాలో వార్తలవుతుంటాయి. మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలున్నాయి..ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి.. నిన్న కాక మొన్ననే జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇచ్చారు.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి .అయితే నూట నలబై కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి కావాల్సింది జమిలీ ఎన్నికలు కాదు..

ప్రతి పేదవాడు మూడు పూటలు కాకపోయిన కనీసం రెండు పూటలైన అన్నం తినే పరిస్థితులు పాలకులు కల్పించాలి.. ఉండటానికి కనీసం గూడు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు.. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం కాకపోయిన సింగల్ బెడ్రూం ఇండ్లు కట్టించివ్వాలి.. కట్టుకోవడానికి గుడ్డ లేని వాళ్లు కూడా కోట్ల మంది ఉన్నారు.. వీళ్లందరికి ఆ మూడు తిండి బట్ట గూడు కల్పించేలా పార్టీలు ప్రణాళికలుండాలి. ఎన్నికలప్పుడు అదిస్తాము.. ఇదిస్తాము అని చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు తప్పా అధికారంలోకి వచ్చాక వాటిని ఆటకెక్కిస్తారు.. చదువుకోవడానికి నాణ్యమైన విద్య అవకాశాలుండవు.. చదువుకున్న విద్యకు సంబంధించి ఉద్యోగాలుండవు.. ప్రపంచంలోని ఏ దేశంలోని లేని యువత భారతదేశానికి సొంతం.. అదే సమయంలో నిరుద్యోగ సమస్యలో దేశం కూడా టాప్ లో ఉంది.. నిరుద్యోగ సమస్యపై కన్జూమర్ పిరమిడ్స్ హోస్ హోల్డ్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.

ఆకలికేకల దేశంలో కూడా టాప్ లో ఉంది.. గ్లోబల్‌ హంగర్ ఇండెక్స్‌ నివేదిక-2022 ద్వారా ఇది స్పష్టమైంది. ఎందుకంటే గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ స్థానం మరింత దిగజారింది. 2021లో 101వ స్థానంలో ఉన్న భారత్‌ ఈసారి 107వ స్థానానికి పడిపోయింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ భార‌త్‌ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఆ ఏడాది సూచీలో భారత్ కంటే వెనుకబడిన ఏకైక ఆసియా దేశంగా ఆఫ్ఘనిస్తాన్ (109) మాత్రమే నిలిచింది..

ఇటీవల కొత్తగా ఏర్పడిన ఓ కొత్త రాష్ట్రంలో ఆ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమయోధుడే పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన సంక్షేమాభివృద్ధిని ఊదాహరణగా తీసుకోని జమిలీ ఎన్నికలు అవసరమా లేదా ఇంకా ఏమి కావాలన్నది ఆలోచిద్దాం.. ఆ కొత్త రాష్ట్రం ఏర్పడితే చీకటిమయం అవుతుంది.. పాలించడం చేతకాదు.. నీళ్ళవాటాల దగ్గర గొడవలవుతాయి.. రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి… నిరుద్యోగ సమస్య పెరుగుతుంది.. నక్సలిజం పెరుగుతుంది ఇలా అనేక కారణాలను అప్పటి పాలకులు ఆ రాష్ట్రమేర్పాటును వ్యతిరేకిస్తూ చెప్పారు.. తీరా రాష్ట్రమేర్పడి.. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చింది.. రాష్ట్రమేర్పడితే జలాల వాటాల దగ్గర గొడవై యుద్ధాలు జరుగుతాయన్న చోట మహారాష్ట్ర తెలంగాణ మధ్య సంబంధం గట్టి పడి ఒప్పందాలతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును నిర్మించారు.. ఒక్క కరెంటు.. నీళ్ళే కాదు. ఆసరా ,కళ్యాణ లక్ష్మీ,రైతుబంధు,రైతు భీమా, దళితబంధు,బీసీ మైనార్టీ బంధు,టీహాబ్ ,టీఎస్ఐపాస్ ,వీహాబ్,షీటీమ్స్ ,కొత్త జిల్లాలు, కలెక్టరేటులు, మెడికల్ కాలేజీలు,ఆసుపత్రులు , దాదాపు రెండున్నర లక్షల సర్కారు కొలువులు,పదిహేడు లక్షల ప్రైవేటు కొలువులు వచ్చాయ్ పదేండ్ల పాలనలో..

మరి పదేండ్ల పాలనలో ఒక్క రాష్ట్రంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఏమి అభివృద్ధి జరిగింది.. ఏమి సంక్షేమం జరిగింది.. నార్త్ కంటే సౌత్ నే బాగా అభివృద్ధి చెందింది. నార్త్ అంతగా అభివృద్ధి చెందలేదన్నది రాజకీయ విమర్శకుల వాదన.. సౌత్ దాటితే రోడ్లు బాగోవు అని కూడా కొంతమంది అంటుంటరు. మరి ఇన్నేండ్ల స్వతంత్ర భారతంలో విడతల వారిగా ఎన్నికలు నిర్వహించి ఏమి అభివృద్ధి చేసినట్లు.. ఏమి సంక్షేమాన్ని ప్రజలకు అందించినట్లు అని రాజకీయ విమర్శకుల వాదన.. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం ఏమి కాదు. అలా చేయడం వల్ల ప్రజాధనం, ప్రజల సమయం ఆదా అవుతుంది. దీనికి ఎవరూ వ్యతిరేకం కాదు.. జమిలీ ఎన్నికలను నిర్వహించాలనే బిల్లుతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోను అమలు చేయకపోతే తర్వాత ఎన్నికల్లో పాల్గోనే హక్కు లేకుండా ఆ పార్టీలకు గుర్తింపు రద్ధు చేయాలి.. అప్పుడు కానీ భయంతోనో.. భక్తితోనో అధికారంలోకి వచ్చిన ఐదేండ్లు ప్రజలకు ఏమి చేయగలమో… ఏమి అందించగలమో ముందు వెనక ఆలొచించి హామీలిస్తారు.. మ్యానిఫెస్టోలు ప్రకటిస్తారు.. ప్రజలు కూడా నోటు తీసుకోకుండా ఓట్లేసిన రోజే పాలకులను ప్రశ్నించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకుంటరు.. అంబేద్కర్ అన్నట్లు నాదేశ ప్రజల చేతికి కత్తివ్వలేదు.. ఓటు అనే ఆయుధమిచ్చాను. పోరాడి రాజులవుతారో…? అమ్ముకుని భానిసలవుతారో అది వారి చేతుల్లో ఉంది అని.. ఓటును అమ్ముకోకుండా తమకు పనిచేసే నాయకులను ఎన్నుకున్నప్పుడే జమిలీ ఎన్నికలైన.. ఇప్పటికి జరిగిన ఎన్నికల విధానమైన లాభం ఉంటుంది తప్పా.. ఇచ్చిన మాటను నెరవేర్చకుండా. ప్రకటించిన మ్యానిఫెస్టోను ఆటకెక్కిస్తే ఎలాఎన్నికలు జరిగిన ఈదేశానికి కానీ ప్రజలకు కానీ ఒరిగేది శూన్యం అని రాజకీయ విమర్శకుల టాక్.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *