సూపర్ స్టార్ ను చూసి నేర్చుకోరూ టాలీవుడ్ సా(స్టా)రూలు..?
ఇటీవల ఓ ప్రముఖ సినీ దర్శకుడు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ” ఎవరి పనులు వాళ్లు చేసుకున్నంతవరకు సక్సెస్ మన ఇంటికి వస్తుంది. ఎప్పుడయితే ఒకరి పనిలో ఇంకొకరూ వ్రేలు పెట్టినప్పుడే విజయం దక్కాల్సిన చోట అపజయం స్వాగతం పలుకుతుంది ” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఓ ప్రముఖ సీనియర్ స్టార్ హీరో గురించే అని నెటిజన్లతో పాటు సినీ క్రిటిక్స్ అప్పట్లో తెగ కామెంట్లు చేశారు. అయితే ఆ దర్శకుడు ఆ సీనియర్ స్టార్ హీరోతో ఓ మూవీ చేశాడు. ఆ మూవీలో ఆ హీరో తనయుడు సైతం నటించాడు.
దర్శకుడు అనుకున్న కథ ఒకటైతే హీరో కథలో పింగరింగ్ చేసి కథను సమూలంగా మార్చేశాడు. అందుకే ఆ మూవీ డిజార్ట్ అయిందని ఆ దర్శకుడి ఆవేదన.. ఆ ఆవేదన నిజమో కాదో అంతకుముందు ఆ దర్శకుడి కేరీర్ గురించి ఆలోచిస్తే ఆర్ధమవుతుంది. అంటే దీనర్ధం కథ కథనం దర్శకుడి చేతికి వదిలేస్తే సినిమా హిట్ అవుతుంది. అంతేకానీ తమకు నచ్చినట్లు కథ మార్పులు చేర్పులు చేస్తే ఫ్లాప్ లు స్వాగతం పలకడం తప్పా ఏముండదని ఆ దర్శకుడి ఇన్ సైడర్ టాక్. నిజమే వారంతా అనుభవం.. అంత సీనియరైన సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ఇటీవల విడుదలైన జైలర్.. వేట్టయాన్ మూవీలను పరిశీలిస్తే అది స్పష్టంగా ఆర్ధమవుతుంది.
టాలీవుడ్ లో తామే మూల స్థంభాలుగా భావించే ఐదారుగురు హీరోలల్లో ఓ ముగ్గురు తాము ఇంకా యూత్ అనే ఫీలింగ్ లో ఆ కథలో ఆరు పాటలు.. నాలుగు పైటులు ఉండేలా కథను తమకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. కానీ రజనీ కాంత్ అలా కాదు జైలర్ దగ్గర నుండి తన పంథాను మార్చుకుని మారుతున్న కాలానికి అనుకూలంగా కథకథనాన్ని ఎంచుకుంటున్నాడు. నిన్న కాక మొన్న విడుదలైన వేట్టయాన్ మూవీలో కూడా ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం అంగీకరించేలా కథకథనం అన్ని సెట్ చేసుకున్నాడు సూపర్ స్టార్..
డెబ్బై మూడేండ్ల వయసున్న నటుడు ఎలాంటి పాత్రల్లో నటిస్తే ప్రేక్షక దేవుళ్ళు ఆంగీకరించి ఆదరిస్తారో అలాంటి పాత్రలను ఎంపిక చేసుకుంటూ తాను ఎందుకో సూపర్ స్టారో నిరూపించుకుంటున్నారు. ఇప్పటికైన సరే టాలీవుడ్ అగ్ర స్టార్ సీనియర్ హీరోలు తమ పంథాను మార్చుకుని కథకథనంలో వ్రేలు పెట్టకుండా నిర్మాతలకు నష్టాలు కలగకుండా పెట్టిన ప్రతిపైసా తిరిగి వచ్చేలా…. ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతిపైసాకు ఆనందం కలిగేలా పాత్రలను ఎంచుకుంటే మంచిది.. లేకపోతే రానున్న రోజుల్లో సీనియర్ స్టార్ హీరోలు నటించే చిత్రాలు డిజార్ట్ అవ్వడమే కాదు వాళ్లతో సినిమాలు తీయాలంటేనే నిర్మాతలు వెనకడుగు వేసే పరిస్థితులు రావడం ఖాయం..!