మీరు తలస్నానం చేస్తున్నారా…?
Health :- సహజంగా ఈరోజుల్లో బయట ఉన్న కాలుష్యం కారణం కావొచ్చు.. బయట నెలకొన్న పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. కారణం ఏదైనా కానీ తలస్నానం రోజు లేదా వారానికో లేదా మూడు నాలుగు రోజులకొక సారి చేయడం సహజం.. అయితే ఇలా తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు..
తలస్నానం చేస్తున్నప్పుడు షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేయకుండా 3 స్పూన్ల గోరువెచ్చటి నీటిలో కలిపి పెట్టుకోండి.రోజూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకల్లో సహజ నూనెలు తొలగిపోయి పొడిగా అవుతాయి.
సల్పేట్ లేని షాంపూలు జుట్టుకు హాని కలిగించవు.షాంపూతో తలస్నానం చేసిన వెంటనే జుట్టును ఆరబెట్టేందుకు డ్రైయర్ వాడితే వెంట్రుకలు బలహీనపడతాయి.రాత్రి పడుకునే ముందు తలకు నూనె రాసి ఉదయం తలస్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.