రివ్యూలు ఆగినంత మాత్రాన సినిమాలు హిట్టవుతాయా..?

 రివ్యూలు ఆగినంత మాత్రాన సినిమాలు హిట్టవుతాయా..?

Do movies become hits only when the reviews stop?

 రానురాను చిత్ర పరిశ్రమకు రివ్యూలు సమస్యగా మారుతున్నాయంటూ వీటిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలని కోలీవుడ్‌ నిర్మాతలు తీర్మానించిన విషయం మనకు తెలిసిందే. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్‌ ప్రాంగణంలోకి యూట్యూబ్‌ ఛానల్స్‌ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్‌ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

తాజాగా జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రిలీజ్ డేట్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రివ్యూలు చెప్పనివ్వం అంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దిల్ రాజు మాట్లాడుతూ.. “తమినాడులో రివ్యూయర్లని మొదటి రోజు థియేటర్స్ దగ్గరకు అనుమతించకూడదని చెప్పడం జరిగింది అంట.

అది అక్కడ సక్సెస్ అవుతాది కాబట్టి ఆటోమేటిక్‌గా మన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఫిలిం ఛాంబర్, ఎగ్జిబిటర్స్ చర్చలు మొదలు పెట్టారు” అంటూ అన్నారు. దీంతో నిజంగానే రివ్యూయర్లకి అడ్డుకట్ట వేయగలరా అనే చర్చ ప్రారంభమైంది. కోలీవుడ్‌లో ప్రధానంగా కంగువా, వేట్టయన్, ఇండియన్ 2 వంటి సినిమాల కలెక్షన్లు తగ్గటానికి వీరి నెగిటివ్ రివ్యూలే కారణమంటూ ప్రొడ్యూసర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రివ్యూలు ఆపినంత మాత్రాన సినిమాలు హిట్టవుతాయా..?. కలెక్షన్లు పెరుగుతాయా…? అని రివ్యూర్స్ విమర్శిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *