కాంగ్రెస్ పార్టీలో తారా స్థాయికి వర్గపోరు.

కాంగ్రేస్ పార్టీ అంటేనే వర్గపోరుకు కేంద్రబిందువు..ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తుంది..ఇన్ని రోజులు స్దబ్దుగా ఉన్న పార్టీలో మెల్లమెల్లగా అంతర్యుద్దం మొదలైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వర్గపోరు నిద్రలేకుండా చేస్తుంది..కొత్త, పాత, సీనియర్లు, జూనియర్లు అనే భేదాలతో పార్టీ ఆగమైతుంది..
అధికారంలోకి వచ్చాక పరిస్థితి మరింత అద్వానంగా మారిందని క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది.పటాన్‌చెరులో హస్తం పార్టీ మూడు ముక్కలుగా విడిపోయింది. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం, నీలం మధు వర్గం, గూడెం మహిపాల్ రెడ్డి వర్గాలుగా విడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ శిధిలావస్థకు చేరుకుందని కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది.అలాగే గజ్వేల్, సిద్దిపేటలో పుట్టగొడుగుల లాగా రోజుకో వర్గం పుట్టుకొస్తుంది.
ఈ మధ్య రేవంత్ రెడ్డి గజ్వేల్ పర్యటనలో రెండు వర్గాలు రేవంత్ రెడ్డి ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఇద్దరు సొంత లాభాల కోసమే ఎక్కువ పని చేస్తున్నారని, పార్టీ కోసం పని చేయడం లేదని సీనియర్ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా ఇదే పరిస్థితి ఉండడంతో రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు.
