ధోనీకి మళ్లీ అదే అవమానం…!

టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన మహేందర్ సింగ్ ధోనీకి మళ్లీ అదే అవమానం జరిగింది. దాదాపు తొమ్మిదేండ్ల కిందట అప్పటి కేకేఆర్ జట్టు కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్ కోల్ కత్తాలోని సొంత మైదానంలో మహేందర్ సింగ్ ధోనీని అవుట్ చేయడానికి ఫీల్డర్స్ అందర్నీ ఓ టయిలైండర్ బ్యాట్స్ మెన్ గా వస్తే ఎలా సెట్ చేస్తారో అలా సెట్ చేశాడు.
ఈ కారణంతోనే అప్పట్లో గౌతీ తీవ్ర విమర్శలకు గురయ్యారు. తాజాగా నిన్న శుక్రవారం కోల్ కత్తా హోం గ్రౌండ్ లో జరిగిన ఐపీల్ మ్యాచ్ లో ప్రస్తుత కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే అప్పటి గౌతమ్ గంభీర్ మాదిరిగా ధోనీ క్రీజులోకి రాగానే ఫీల్డ్ సెట్ చేసి ప్రస్తుతం నెట్టింట విమర్శలకు గురవుతున్నారు.
టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో వరల్డ్ కప్ లను అందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు సార్లు ఐపీఎల్ కప్ లనందించిన లెజండ్రీ ఆటగాడ్కిచ్చే గౌరవం ఇదేనా అని రహానేపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు.

