ధర్మపురి లో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన: కొప్పుల ఈశ్వర్.

 ధర్మపురి లో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన: కొప్పుల ఈశ్వర్.

Loading

సింగిడిన్యూస్, ధర్మపురి: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ కు వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు అడ్డుపెట్టుకొని ఈ విధంగా ప్రజల పైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు..ధర్మపురి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరంనర గడిచిన ఎమ్మెల్యే గెలిచిన లక్ష్మణ్ కుమార్ తట్టెడు మట్టి తీయలేదు…!10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కాలేదు అని మాట్లాడితే, దానిని ప్రశ్నించి ప్రెస్ నోట్ పెడుతున్న క్రమంలో ప్రెస్ పార్టీ నోట్ పెట్టొద్దని బిఆర్ఎస్ పై కాంగ్రెస్ దౌర్జన్యం చేయడం జరిగింది.


10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిన నాయకుడు కెసిఆర్ గారు
ధర్మపురి నియోజకవర్గం లో మొత్తం గ్రామాలను సస్యశ్యామలం చేసింది కొప్పుల ఈశ్వర్ గారు అని ప్రెస్ మీట్ లో ఏఏ గ్రామంలో ఏఏ మండలం లో గొప్పగా అభివృద్ధి చేసినం అనే విషయంపై మాట్లాడే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని దాడులకు పాల్పడ్డారు.మాయమాటలు చెప్పి, ఎన్నికల కోసం అధికారం కోసం అలివి కానీ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేస్తా ఉన్నారు.నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి.మీ ముఖ్యమంత్రి గారి మా దగ్గర ఏం లేవు కోసినా కూడా ఒక్క పైసా లేదు, ఎవడు కూడా నమ్మి అప్పు ఇవ్వడం లేదని మాట్లాడుతున్నాడు. నియోజకవర్గం లో ఏం అభివృద్ధి చేసిండ్రని చేల రేగి పోతున్నారు..420 హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేసిండ్రు అని ప్రశ్నించారు.దళిత బంధు గురించి విమర్శిస్తున్నారు..దళిత బంధు పథకం ఒక వినూత్నమైన కార్యక్రమం దేశంలోనే దళితులకు సంబంధించి ఇంత గొప్పగా ఆలోచించి మంచి కార్యక్రమం తీసుకున్న టువంటి నాయకులు కేసీఆర్ గారు వాళ్ల జీవితాల్లో వెలుగు నింపాలని ఆలోచించింది కేసీఆర్ గారు..

మన ధర్మపురి నియోజకవర్గం లో 2200 మందికి దళిత బంధు మంజూరు చేయడం జరిగింది , చాలామంది డబ్బులు ఇచ్చాం, అనేకమంది యూనిట్లు పెట్టుకొని గొప్పగా బతుకుతున్నారు..అదే కాకుండా మేము మంజూరు చేసినటువంటి డబ్బులు కలెక్టరేట్ అకౌంట్లో ఉంటే కూడా రిలీజ్ చేయకుండా ఫ్రీజ్ చేసి దళితులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బందు గురించి మాట్లాడే హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏముందని అన్నారు..కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం సంగతేంటి, అమలు కాని హామీలకు సమాధానం చెప్పకుండా దాడులకు దిగుతున్నారు ఇది మంచిది కాదని హెచ్చరించారు

ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలను ఎవరు క్షమించారు, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే ఇలాంటి సంఘటన, దౌర్జన్యం జరగలేదు, పోలీసులను ఉపయోగించి వేదిచలేదు సాధించలేదు కక్ష సాధింపు చర్యలు చేయలేదు.పరిపాలించే పద్ధతి కాదు, ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత అభివృద్ధి చేస్తారో చేసి చూపించండి, కానీ భౌతిక దాడుల గీతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం,నిజంగానే ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు కళ్ళు కనిపిస్తే ఈ ధర్మపురి నియోజకవర్గం లో గొప్పగా అభివృద్ధి జరిగిందో ప్రజలను అడిగితే తెలుస్తుంది. నువ్వు గెలిచినప్పటి నుండి ఏ ఒక్క విషయం పైన దృష్టి పెట్టావా ధర్మపురి మంచినీళ్ల గురించి మాట్లాడుతున్నావ్, ఊరికిన వచ్చాయా మంచి నీళ్ళ గురించి ఎన్ని చర్యలు తీసుకున్నాం నీకేం తెలుసు రెండు లక్షల కెపాసిటీ కలిగిన సంపు నిర్మించాం వాటర్ ట్యాంక్ నిర్మించాం, కమలాపూర్ నుండి పైప్ లైన్ వేశాం మిషన్ భగీరథ కాకుండా ప్రత్యామ్నాయంగా మంచినీళ్లు ఇచ్చే ఏర్పాటు చేసాం, ఎన్ని నీళ్ళు వచ్చాయి.

నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావ్,ఇలాంటి సంప్రదాయం సరియైన కాదు, అధికారం వచ్చింది ప్రజలను మెప్పించుకునే విధంగా పని చేసి ముందుకోవాలని, ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడితే బిఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఉండదని, ఎవరు దౌర్జన్యం చేసిన ఊరుకునేది లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *