దేవర ఆల్ టైం రికార్డు

Devara All Time Record
దాదాపు ఆరేండ్ల తర్వాత సోలో గా హీరోగా నటించిగా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తున్న దేవర మూవీతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ఫార్ములా.. ఎన్టీఆర్ మాస్ .. జాన్వీ కపూర్ అందాల ఆరబోత.. సీనియర్ నటులు ప్రకాష్ రాజు, సైఫ్ అలీఖాన్, అజయ్ ,మురళి శర్మ నటన.. బీజీఎం.. పాటలు వెరసీ సూపర్ డూపర్ హిట్ టాక్ తో మూవీ ప్రేక్షకులను ఆలరిస్తుంది.
ఈ క్రమంలో దేవర ఆల్ టైం రికార్డును సోంతం చేసుకుంది. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఒకేరోజు నలబై రెండు షోలను ప్రదర్శించనున్నారు.
ఆర్ధరాత్రి ఒంటి గంటతో దేవర షో ప్రారంభమై నేడు లాస్ట్ షోతో మొత్తం 42 షోలను పూర్తి చేసుకోనున్న మూవీ ఇదే అని ప్రసాద్ ఐమ్యాక్స్ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు కేవల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఒక్కటే 41షోలు అత్యధికంగా ప్రదర్శించబడింది.