కర్నూలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

Deputy CM Pawan Kalyan’s visit to Kurnool
ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు..ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాన్ ఓర్వకల్ (మం) పూడిచెర్ల వద్ద నీటిగుంట పనులు ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు. అనంతరం ఆయన పంట సంజీవిని నీటిగుంట పనులను ప్రారంభించారు.
ఈసందర్భంగా జనసేనాని మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 55 వేల నీటికుంటలు ఏర్పాటు చేయబోతున్నాము..
ఉపాధి హామీ పథకం పటిష్టత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కష్టపడి పని చేస్తున్నాము.. దేశం బాగుండాలి, పల్లె పండుగ, రోడ్లు అని నేనంటుంటే.. ఓజి ఓజి అంటున్నారు.. అభిమానుల బలం ముందు నేను కూడా తట్టుకోలేను అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.