ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టీ- అందుకేనా..?
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క నిన్న బుధవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రానున్నట్లు గాంధీ భవన్ వర్గాలు.. ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలో ఏఐసీసీ వర్గాలను కల్సి మిగిలిపోయిన 6గురు మంత్రుల భర్తీపై చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలను కల్సి తననుండి అభిప్రాయాన్ని సూచనలను అందించారు.
తాజాగా భట్టీ పర్యటనతో ఈ అంశంపై తుది క్లారీటీ రానున్నదని సమాచారం . ప్రస్తుతం నలుగురికి మంత్రివర్గంలో స్థానం లభించనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగతా ఇద్దర్కి స్థానం లభించనున్నది అని తెలుస్తుంది.