డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క వట్టీ మాటలు..!

Deputy CM Bhatti Vikramarka Vatti’s words..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేస్తున్న సంగతి మనకు తెల్సిందే. ఈ దుస్తులను మహిళా సంఘాల సభ్యులే కుడుతుంటారు. వారికి ప్రభుత్వం యూనిఫాంకు రూ.50చొప్పున చెల్లిస్తున్నది. కానీ దానిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ సాక్షిగా అబద్ధం చెప్పింది. తాము రూ.25 పెంచి రూ.75 ఇస్తున్నామని ఆర్థికమంత్రి.. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లు తెలిపారు. కానీ ఇదంతా అబద్ధమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్ బయటపెట్టింది.
కేవలం జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్న సర్కారు అదనంగా చెల్లిస్తున్నామని చెప్పుకోవడమేంటని ఆ పార్టీకి చెందిన మహిళా నేతలు మండిపడుతున్నారు. అయితే గతంలోనే బడి పిల్లలకు యూనిఫాంలు కుట్టే తమకు కూలీ గిట్టుబాటు కావడం లేదు.. కూలీ పెంచాల్సిందేనని గతంలో మహిళా సంఘాల నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కేంద్రం సమగ్ర శిశుయోజన కింద ఒక్కో జతకు రూ.50 చెల్లిస్తున్నది..
రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కలిపి రూ.75 చొప్పున ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు నిరుడు జూన్ 7న ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. జీవో రాగానే కూలీ పెరిగిందని మహిళా సంఘాల సభ్యులు భావించారు. రాష్ట్రంలోని 26,009 బడుల్లోని 18,58,841 మంది విద్యార్థులకు ఒక్కో జత చొప్పున కుట్టి అధికారులకు అందించారు. కానీ ప్రభుత్వం జతకు రూ.50 మాత్రమే చెల్లించింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు షాక్‌కు గురయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు.