బీఆర్ఎస్ భవనాన్ని కూల్చేయండి

Demolish the BRS building
తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న శనివారం నల్గొండ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని నూతన భవన నిర్మాణం పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ “2019లో నిబంధనలకు విరుద్ధంగా గజం వందరూపాయలకు ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని బీఆర్ఎస్ తమ పార్టీ కార్యాలయానికి నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు.
అడ్డుకోకుండా ఏమి చేశారు.. నేను అమెరికా వెళ్తున్నాను.. ఈ నెల పదకొండు తారీఖున తిరిగి వస్తాను.. అప్పటిలోగా భవనాన్ని కూల్చేయాలి అని అధికారులను ఆదేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు..ఆలోపు భవనం కూల్చి వేయకపోతే చర్యలు తప్పవని ఆయన అన్నారు..