కేసీఆర్ తో ఫిరాయింపు ఎమ్మెల్యే భేటీ..!

Defector MLA meets KCR..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. సభ వాయిదా పడిన అనంతరం ఓ సీనియర్ మంత్రి బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. దాదాపు పది నిమిషాలు మాట్లాడారు అనే వార్త బయటకు వచ్చింది.
ఆ వార్త రాగానే ఇంకో వార్త విత్ ప్రూప్ తో బయటకు వచ్చింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
ఇటీవల నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ.. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ పార్టీనా.. లౌ.ల పార్టీన అని పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కేసీఆర్ తో భేటీ అయిన ఈ ఫోటో వైరల్ అవ్వడం విశేషం. అయితే ఇది నిజమా కాదా అనేది సదరు ఎమ్మెల్యే క్లారిటీవ్వాల్సి ఉంది.

