గులాబీ వైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల చూపు..!

 గులాబీ వైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల చూపు..!

Loading

గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లలోవిజయం సాధించింది..39 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అయితే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు..

అందులో కేసీఆర్ గారికి అతి దగ్గరగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి లాంటి వాళ్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరారు. వీరి చేరిక రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ హైకోర్టులో పోరాటం చేస్తుంది. అలాగే సుప్రీంకోర్టులో పోరాటం చేస్తుంది. ఇటీవల కోర్టు సైతం స్పీకర్ తన నిర్ణయాన్ని త్వరగా వెల్లడించాలంది..దీంతో ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది.

ఇంతకూ తాము కాంగ్రెస్ లో ఉన్నామా..? బీఆర్ఎస్ లో ఉన్నామా తెలియక పిరాయింపు ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది.. కోర్టులో తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చి ఉపఎన్నికలు వస్తే తాము గెలిచే పరిస్థితి లేనందున కేసీఆర్ గారితో వారు చర్చలకు వెళ్లాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది..

అందుకోసం ఓ మాజీ మంత్రిని సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ గారు ఆమోదిస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరాలని యోచిస్తున్నట్టు సమాచారం.. అయితే కేసీఆర్ గారు కష్టకాలంలో వారు పార్టీని వీడిపోయారని, వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి కేసీఆర్ గారు చేర్చుకోకపోతే ఉప ఎన్నికలు వస్తే వారి పరిస్థితి ఏంటో ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే..!!

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *