రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం…!
ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. నటి రేణు దేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణునే తన సోషల్ మీడియా అకౌంటు వేదికగా తెలిపారు.
తన తల్లి ఫోటోని షేర్ చేస్తూ ఓం శాంతి అని పోస్టు చేశారు. దీంతో నటి రేణు ను నెటిజన్లు ఓదారుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.