నేషనల్ క్రష్ “రష్మీకా మందన్నా” కి ప్రమాదం
నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న దేవత.. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన హాట్ బ్యూటీ.. ఒకవైపు అందంతో మరోవైపు అభినయంతో సినిమా ప్రేక్షక దేవుళ్ల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్. అలాంటి స్టార్ హీరోయిన్ రష్మీకా గత నెలరోజులుగా యాక్టివ్ లేరు. ఎక్కడ కూడా చిన్న అప్డేట్ లేదు. పుష్ప – 2 అప్డేట్ తప్పా ఈ ముద్దుగుమ్మ గురించి ఎక్కడ కూడా చిన్న వార్త లేదు.
అలాంటిది హాట్ బ్యూటీ తన అభిమానులను.. సినిమా ప్రేక్షకులను కలవరపెట్టే అప్డేట్ తో ముందుకు వచ్చింది. తన అధికారక ఇన్ స్టా గ్రామ్ లో ” నాకు కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. నెల రోజులుగా నేను యాక్టివ్ లేను. ఓ చిన్న ప్రమాదం జరగడమే దీనికి కారణం .. వైద్యుల సూచన మేరకు నేను నెల రోజులుగా విశ్రాంతి తీసుకున్నాను.
త్వరలోనే మళ్లీ బిజీ అవుతాను. జీవితం చాలా చిన్నది… మరింత విలువైంది. జాగ్రత్తగా ఉండండి. మనల్ని అభిమానించే వాళ్ల గురించి ఆలోచించాలి.. రేపు అనేది ఉంటదో ఉండదో తెలియదు. అందుకే ఉన్నన్నాళ్ళు ఆనందంగా ఉండండి.. హ్యాపీగా జీవించండి “అని అమ్మడు హితబోధ చేశారు. దీంతో తమ అభిమాన నటి త్వరగా కోలుకోవాలి.. త్వరగా తమ ముందుకు రావాలని కామెంట్లు చేస్తున్నారు.