“దేవర” నుండి క్రేజీ అప్డేట్

 “దేవర” నుండి క్రేజీ అప్డేట్

Crazy Update From Devara

Loading

కొరటాల శివ దర్శకత్వంలో హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కల్సి నిర్మిస్తున్న తాజా చిత్రం “దేవర”. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ,అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ మూవీ నుండి విడుదలైన పాటలు ఇప్పటికే రికార్డుల మోత మ్రోగిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు శివ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు వినాయకచవితి సందర్భంగా చిత్రం యూనిట్ తరపున గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు.

దీంతో పాటు దేవర పార్ట్ -1 ట్రైలర్ ఈ నెల పదో తారీఖున విడుదల చేస్తామని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క పనులు పూర్తయ్యాయి. ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *