కేసీఆర్ ను తిట్టడమే కాంగ్రెస్సోళ్ల పని..!

 కేసీఆర్ ను తిట్టడమే కాంగ్రెస్సోళ్ల పని..!

KCR Former CM Of Telangana

తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తిట్టడమే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ప్రధాన లక్ష్యం అని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా.. నాలుగోందల ఇరవై హామీలను గాలికి వదిలేసి నిత్యం బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ముఖ్య పని ఆయన ఆరోపించారు. పదేండ్ల పాటు జరిగిన అభివృద్ధిని పది నెలల్లోనే ఆగమాగం చేశారు.

కరెంటు కోతలు.. తాగుసాగునీటి కష్టాలను మళ్లీ తెచ్చారు. నిరుద్యోగ యువత గొంతు కోశారు. మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తామని మోసం చేశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. రైతుభరోసా అన్నారు. రైతులను అన్నిరకాలుగా వంచించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *