కేసీఆర్ పై కాంగ్రెస్ సిల్లీ పాలిటిక్స్..?

Former CM KCR to the High Court..!
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… గజ్వేల్ శాసనసభ్యులు కేసీఆర్ పై ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు సిల్లీ పాలిటిక్స్ మొదలెట్టారు. గత పది నెలలుగా తమ ఎమ్మెల్యే కన్పించడం లేదని స్థానిక పీఎస్ లో కాంగ్రెస్ శ్రేణులు పిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తమ ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యే తమకు కన్పించడం లేదంటూ ఆ పిర్యాదులో పేర్కొన్నారు.
అయితే సర్కారు వచ్చి పది నెలలైన కానీ ఇంతవరకూ హోం మినిస్టర్ … విద్యాశాఖ మంత్రి పత్తా లేడు. మిగతా ఆరు శాఖలకు సంబంధించి మంత్రులెవరూ ఇంతవరకూ లేరు.రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైన కానీ విద్యాశాఖలో అనేక అవకతవకలు జరుగుతున్నా కానీ సంబంధిత మంత్రుల గురించి మాట్లాడని అధికార పార్టీకి చెందిన నేతలెవరూ స్పందించడం లేదు.
అలాంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఫామ్ హౌజ్ లో ఉంటాడు. ఇది గజ్వేల్ ప్రజలతో పాటురాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెల్సు. ఇది తెల్సి కూడా రాష్ట్ర ప్రజలకు అవసరమైన విషయాల గురించి మాట్లాడకుండా ఇలాంటి సిల్లీ ఆలోచనలతో కాంగ్రెస్ శ్రేణులు సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారు అని మేధావులు,నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ పై ఇలాంటి సిల్లీ పాలిటిక్స్ కాకుండా ప్రజలకవసరమయ్యే పాలిటిక్స్ చేయాలని వారు సూచిస్తున్నారు.
