పిరాయింపు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ షాక్..!
Politics : తెలంగాణలో రాజకీయం రోజురోజుకు అనూహ్య మలుపులు తిరిగుతుంది.సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో ,బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాదించాయి.తరువాత జరిగిన పరిణామాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న,బీఆర్ఎస్ లో ఉన్నత పదవులు అనుభవించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి,కడియం శ్రీహరితో సహా 10 మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.
దీనిపై బీఆర్ఎస్ సైతం దీటుగానే స్పందించింది.పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హత వేయాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తుంది.స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే సుప్రీం కోర్టుకు వెల్లేందుకు వెనకాడమని బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే..ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది.కడియం కూతురుకు ఎంపీ టికెట్ ఇవ్వడం మినహ మిగతా ఎమ్మెల్యేలకు పెద్దగా ఒరిగిందేం లేదనే చెప్పవచ్చు.
కాంగ్రెస్ లో వారికి కనీస మర్యాద దక్కకపోగా ఆ పార్టీలో ఉన్న స్థానిక నేతలతో నిత్యం వివాదాలు జరుగుతున్నాయని మదన పడుతున్నారట.బీఆర్ఎస్ లో కేసీఆర్ పక్కన దర్జాగా ఉండాల్సింది పోయి అదికారం ఉందని కాంగ్రెస్ లోకి వస్తే ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేడని భాదపడుతున్నారట.కాంగ్రెస్ అదిష్టానం కూడా వాళ్ళను చేర్చుకున్నట్టు చేర్చుకుని ఎలాగూ మల్లీ పార్టీ మారరు కాబట్టి పడి ఉంటారులే అనే దోరణిలో ఉన్నట్టు సమాచారం,పిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైందనటానికి ఇది నిదర్శనం..