పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అబద్ధాలు
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలోని భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేశారని బీఆర్ఎస్ కు చెందిన నేతలు విమర్శించారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ని ఒకేసారి చేసింది”.
దేశంలోనే తొలిసారిగా రైతుల రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లను ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మాది. సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు..
ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందిస్తూ “లక్ష రూపాయల రుణమాఫీ అంటూ హంగామా చేసి కేవలం కొంతమందికే చేస్తూ దానికోసం అరువేల కోట్లు మాత్రమే విడుదల చేశారు.. మిగతా ఇరవై ఐదు వేల కోట్లు ఎవరి ఖాతాల్లో వెళ్లాయి .. కాంగ్రెస్ నేతల ఖాతాల్లో వెళ్లాయా అని హెద్దెవా చేశారు..