కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

T. Jeevan Reddy Member of Telangana Legislative Council
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో తనకు చెందిన ఓ అనుచరుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీనికి నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో ధర్నాకు దిగారు.
జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే.. విప్ అడ్లూరి లక్ష్మణ్ తో జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు మీ పార్టీకి ఓ దండం. ఇంతకాలం మానసికంగా అవమానాలకు గురవుతున్నాము.. మేము భరించాము.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాము..
అయిన కానీ మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు. ప్రజలకు సాయం చేయాలనుకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటాము.. ఓ ఎన్జీవోను పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
