కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లేనా..?

తెలంగాణ మండలిలో ఈనెలలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తున్నది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ పెద్దలు మంతనాలు జరిపారు.
రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో సమావేశమై చర్చించారు.. ఈరోజు హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నరు మీనాక్షి నటరాజన్.. ఎమ్మెల్సీ స్థానాల్లో సీపీఐకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉంది.. మిగిలిన మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీ లేదా ఓసీకి సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలన.. ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓసీ కోటాలో జెట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇంఛార్జ్ కుమార్ రావులను ఖరారు చేయనున్నట్లు టాక్. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీకి నో ఛాన్స్ .. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఉన్నవారికి కూడా అవకాశం లేనట్లే ఉంది..
