కేసీఆర్ తో టచ్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

Congress MLAs Touch With KCR
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా..?. గత పదిహేను నెలలుగా ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని సదరు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారా..?. అందుకే గులాబీ దళపతితో టచ్ లోకెళ్లారా..?. నిన్న బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ లాబీలో కేసీఆర్ తో భేటీ అయ్యారా..?.
మరోవైపు సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి అందుకే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూస్తున్నారు అని వ్యాఖ్యానించారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు. నిన్న బుధవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు సదరు ఎమ్మెల్యేలపై పాజిటీవ్ కార్నర్ ఉంది. నాకు అన్నీ తెలుసు. మీరు ఆ పార్టీలోకెళ్తే మీకు టికెట్ ఇస్తారని ఆశపడుతున్నారా .. ఇకనైన తీరు మార్చుకోవాలని సూచించినట్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
గత కొంతకాలంగా రేవంత్ తీరుతో ఇటు సీనియర్లు అటు ఆ పార్టీ నేతలు తెగ ఇబ్బందులు పడుతున్న సంగతి తెల్సిందే. ప్రతిపక్షంలో ఉన్నట్లే అధికారంలోకి వచ్చాక కూడా అదే విధంగా వ్యవహారించడం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలాన్ని గడపడం.. సీనియర్లతో సహా అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేలు.. మంత్రులు చెబుతున్న సూచిస్తున్న సలహాలను పక్కనెట్టడంతో రేవంత్ పై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇటు ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉండటంతో వచ్చేన్నికల్లో అధికారం పక్కనెట్టు కనీసం డిపాజిట్లు కూడా దక్కవనే నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేలు ముందుగానే తమ ఇల్లును చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. అందుకే వాళ్ళు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని ఇటు గాంధీ భవన్ వర్గాలు.. అటు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
