నెటిజన్లకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్..!

Villagers revolt against Congress MLA..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం సోషల్ మీడియా నెటిజన్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నకిరేకల్ లో ఇటీవల పదో తరగతి పరీక్ష తెలుగు పేపర్ లీకైన సంఘటన మనకు తెల్సిందే. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులున్నారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యే వీరేశం హాస్తం ఉందని ట్రోల్ చేశారు.
దీంతో ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ వార్తలపై స్పందిస్తూ తనపై సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూ ర్వకంగా విమర్శలు చేస్తున్నారు.. వారికి గతంలో ప్రశ్నపత్రాల లీకుల అలవాటుందని ఆయన విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “నాపై ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారో సమయం వచ్చినప్పుడు చెబుతాను.
వాళ్లకు అనుమానాలుంటే సభలో లేవ నెట్టొచ్చు. నా పేరు ప్రస్తావిస్తే దళిత సమాజం ఏమనుకుంటుందో అన్న భయం వారికి ఉంది. అందుకే ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్నారు. మాటలుజారినా.. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినా మేమేంటో చూపిస్తాం” అని హెచ్చారించారు.