రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..?

 రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..?

CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు దిమ్మతిరిగే షాకిచ్చారు. నిన్న ఆదివారం వరంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత .. కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కూతురి వివాహాం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు అతిరథమహరథులు హజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అయితే స్థానిక వరంగల్ వెస్ట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన కానీ వెళ్లి స్వాగతం పలకడానికి ఇష్టపడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ వెస్ట్ సీటు విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి ల మధ్య వివాదం మొదలైంది. అప్పటి నుండి వీరిద్దరూ ఎడా ముఖం పెడ ముఖం పెట్టుకున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోకసారి బయటపడ్డాయి. మరోవైపు ఇదే జిల్లాకు చెందిన మంత్రి సురేఖ ,ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

ఇంకోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గత ఎన్నికల తర్వాత నుండి పార్టీ కి దూరంగా ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పార్టీ వర్గ విబేధాలతో పార్టీ ఆధిష్టానం తలలు పట్టుకుంటున్న తరుణంలో తాజాగా పరిణామం చోటు చేసుకోవడంతో పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *