కొండా సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆధిష్టానం సీరియస్ -చర్యలు తప్పావా..?

Rahul Gandhi With Sonia Gandhi
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ఇంట బయట ఆమెపై తీవ్య అగ్రహా జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.. సోషల్ మీడియా వేదికగా #FilmIndustryWillNotTolerate , #KondaSurekha యాష్ ట్యాగ్స్ తో మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సురేఖ తీరుపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసినట్లు గాంధీ భవన్ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.
సమంత పై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై సహచర మహిళ మంత్రిగా సీతక్క ఖండించకపోగ మరింత రెచ్చిపోవడంపై కూడా జాతీయ అధిష్టానం వీరిద్ధరిపై తీవ్ర అసహానం వ్యక్తం చేసింది.నిన్న రాత్రి ఫోన్ లో మాట్లాడిన ఆ పార్టీ పెద్దలు ఇప్పటికే హైడ్రాతో కాంగ్రెస్ పార్టీకి జరిగిన డ్యామేజ్ ను పూడ్చుకోలేకపోతున్న తరుణంలో తాజాగా ఓ మహిళ మంత్రి సాటి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు దేశమంతటా తీవ్ర ప్రభావితం చేస్తాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైతం ఈ వ్యాఖ్యలు ప్రభావితం చేయనున్నాయి..
ఇప్పటికే హైడ్రాతో సగం డ్యామేజ్ అయిన తరుణంలో మంత్రి వ్యాఖ్యలతో మహిళలంతా వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. ఏదైన అంశం ముందు మాట్లాడే ముందు ఆచూతూచి మాట్లాడాలి తప్పా ఇలా మాట్లాడటం ఎంత వరకు కరెక్టు.. దీనిపై టీపీసీసీ నేతృత్వంలో నివేదిక ఇవ్వాలని…తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రిని కోరినట్లు సమాచారం. అందుకే ఈరోజు ఉదయం మంత్రి సురేఖ మీడియా సమావేశం పెట్టడం.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీడియో విడుదల చేయడం జరిగిందని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.