ఢిల్లీలో బీజేపీ గెలుపుకి కాంగ్రెస్సే కారణం..!

 ఢిల్లీలో బీజేపీ గెలుపుకి కాంగ్రెస్సే కారణం..!

Loading

నిన్న శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నాయకులు.. మాజీ మంత్రులైన సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా లాంటి ఆప్ అగ్రనేతలందరూ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి అయిన అతిశీ తప్పా ఎవరూ గెలవలేకపోయారు. మరోవైపు దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ నలబై ఎనిమిది స్థానాలతో అధికారాన్ని దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో రేపో మాపో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది ఆ పార్టీ జాతీయ అధినాయకత్వం తేల్చనున్నది. ఒకపక్క ఢిల్లీలో ఆప్ ఓటమి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఇటు పొలిటికల్ క్రిటిక్స్ అటు ఆప్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేరళలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో పాల్గోని చేసిన వ్యాఖ్యలు ఈ వాదనలకు బలం చేకూర్చుతున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

ఎందుకంటే ఢిల్లీ అధికారాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన పద్నాలుగు సీట్లల్లో కాంగ్రెస్ పార్టీ ఆప్ గెలుపుకి గండి కొట్టింది. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..? . ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” హార్యానా రాష్ట్రంలో ఆప్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మమ్మల్ని.. మా కాంగ్రెస్ పార్టీని గెలికారు. అనేక ఇబ్బందులకు గురి చేశారు.

అందుకే మేము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ను.. అరవింద్ కేజ్రీవాల్ ను గెలికాము. అందుకే బీజేపీ గెలిచిందని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఇటు ఆప్ నేతలు.. అటు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీకి బీటీమ్ కాంగ్రెస్ అంటే ఎవరూ నమ్మడం లేదు. తాజా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ ఉన్నంతవరకూ బీజేపీ గెలుపుకు.. మోదీకి తిరుగులేదు.. ఇప్పటికైన ప్రజలు వాస్తవాలు తెలుస్కోవాలని సూచిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *