బీఆర్ఎస్ ను ఫాలో అవుతున్న కాంగ్రెస్…!

 బీఆర్ఎస్ ను ఫాలో అవుతున్న కాంగ్రెస్…!

BRS VS CONGRESS

Loading

అదేంటీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ను ఫాలో అవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఈ ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బరిలోకి దిగడం లేదని ప్రకటించింది.

కాంగ్రెస్ కు హైదరాబాద్ లో తగినంత బలం లేదని పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా అదే అంశంతో బరి నుండి తప్పుకుంది. హైదరాబాద్ లో మొత్తం 127ఓట్లు ఉన్నాయి. ఇందులో తొమ్మి ది ఖాళీగా ఉన్నాయి. పోగా మొత్తం ఓట్లు 118. ఇందులో అరవై ఓట్లు వస్తే ఆ అభ్యర్థి గెలిచినట్లే. అయితే ఈ ఓట్లలో ఎంఐఎం కు యాబై రెండు.. బీఆర్ఎస్ కు నలబై ఒకటి.. బీజేపీకి ఇరవై ఐదు ఓట్లున్నయి.

అయితే జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు.. కార్పోరేటర్లు కాంగ్రెస్ లో చేరిన కానీ తమకు బలం లేదని ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుండి పక్కకు జరిగింది. గతంలో జరిగిన నల్గోండ, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు తగినంత పట్టు లేదని బీఆర్ఎస్ తప్పుకున్నట్లే ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పుకుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *