ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొనడంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో సగం వరి దళారుల పాలైందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హారీష్ రావు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అందోల్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గోన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.
సన్నాలకు ఐదోందల బోనస్ అన్నారు. బోగస్ చేశారు. రైతుబంధును బంధు పెట్టారు. రైతుభరోసాని గాలికి వదిలేశారు. రుణమాఫీని అరకొర చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించారు. యువతకు ఉద్యోగాలు అన్నారు. మోసం చేశారు అని ఆయన ఆరోపించారు.