హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు..
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని మాట తప్పి.. ఇప్పుడు రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ మోసం చేస్తున్నాడని అన్నారు..