బీజేపీకి బీ పార్టీ కాంగ్రెస్..!
కాంగ్రెస్ వైఖరిపై ఆప్ నేతలు మరోసారి నిప్పులు చెరిగారు . కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ పార్టీ అని చెప్పడానికి ఓ ఊదాహరణ చెప్పారు. ఇటీవల జరిగిన హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు నిరాకరించడం వల్లనే ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా బరిలోకి దిగుతుంది అని ఆప్ నేతలు చెబుతున్నారు.
ఆప్ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీకి బీ పార్టీగా వ్యవహరిస్తుంది.మరో వైపు కాంగ్రెస్ నేతలు బలంగా పోటిపడితే అది బీజేపీకి లాభం కలుగుతుంది. దాదాపు ఇరవై ఆరేండ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి దోహాదపడుతుంది అని కమలం నాథులు చెబుతున్నారు అని ఈ సందర్భంగా ఊదాహరించారు..
ముక్కోణపు పోటిలో బీజేపీకి లాభం అంచనా వేస్తున్నారు. ఇండియా కూటమిలో ఆస్తిత్వం లేదు.. ప్రధాన పోటి బీజేపీ,ఆప్ ల మధ్య ఉంటుందని ఆప్ కన్వీనర్,మాజీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.