తెలంగాణ బీజేపీలో అయోమయం
తెలంగాణ బీజేపీలో ఏమి జరుగుతుందో తెలియక పార్టీ ఆధిష్టానం నుండి ఎమ్మెల్యే.. ఎంపీ.. నేతల .. కార్యకర్తల వరకు ఏమి ఆర్ధం కాక అయోమయంలో ఉన్నట్లు ఆపార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. పార్టీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్,ధర్మపురి అరవింద్,డీకే ఆరుణ లాంటి వాళ్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎవరికి వారే యమున తీరు అన్నట్లు అంటిముట్టని విధంగా ఉంటున్నారు అని బీజేపీ శ్రేణులు వాపోతున్నారు. ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ సమన్వయ లేమి వెలుగులోకి వచ్చింది.
సహాజంగా అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభలో ఏమి మాట్లాడాలి.. ఏమి ఏమి ప్రశ్నలు అడగాలి. ప్రభుత్వంపై ఎలా పోరాడాలి ఇలా తదితర అంశాల గురించి పార్టీ నాయకత్వం.. ఎల్పీ సమావేశమై చర్చించుకోవడం సహాజం. కానీ ఇంకో నాలుగు మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న తరుణంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఒంటరిగా సభలో ఏమి మాట్లాడాలి.. సభలో ప్రభుత్వాన్ని ఎలాంటి ప్రశ్నలు అడగాలి ఇలా తదితర అంశాల గురించి ఎవరికివారే తయారు చేసుకుంటున్నారు అని కమలం శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు.
ఇటీవల ఓ ప్రముఖ నాయకుడు.. మాజీ మంత్రి … ప్రస్తుత ఎంపీ అయిన ఓ నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలని జాతీయ ఆధిష్టానం తయారవుతున్న తరుణంలో రాష్ట్రంలోని ఓ వర్గం అడ్డుపడింది. అందుకే వర్గాలుగా ఉన్న రాష్ట్ర బీజేపీలో ఎవరి మధ్య సమన్వయం లేదు.. ఎవరూ కల్సి కట్టుగా పని చేయడంలేదు.. అందుకే ఇన్నాళ్లు వెలుగులోకి రాని ఈ విషయం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బయటపడింది. ఇప్పటికైన జాతీయ నాయకత్వం తెలంగాణ బీజేపీపై దృష్టి పెట్టాలని ఆ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు.